ఎనిమిదో రోజు జ‌గ‌న్‌కు రఘురామ లేఖ‌

రాష్ట్రంలోని పేదలందరికీ త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి..రఘురామకృష్ణ‌రాజు

అమరావతి: ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస‌గా ఎనిమిదో రోజు మ‌రో లేఖ రాశారు. రాష్ట్రంలోని పేదలందరికీ త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. ఇళ్లు ఇస్తామ‌న్న‌ హామీతో ప్రజల నుంచి వైస్సార్సీపీ కి మద్దతు లభించిందని ఆయ‌న తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తోందని ఆయ‌న గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఖర్చు చేస్తామని ఎన్నికల ముందు జ‌గ‌న్ హామీ ఇచ్చారని చెప్పారు. జగనన్న కాలనీల్లో ఇంత వరకు మౌలిక సదుపాయాల కల్పన కూడా పూర్తికాలేదని అన్నారు.

కాగా, ఇప్ప‌టికే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ‌రుస‌గా వృద్ధాప్య పింఛ‌న్లు, సీపీఎస్‌ విధానం రద్దు, పెళ్లి కానుక‌, షాదీ ముబార‌క్, ఉద్యోగాల క్యాలెండ‌ర్, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం, ప్ర‌భుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, పీఆర్సీ ప్ర‌క‌ట‌న, రైతుల‌కు సాయం వంటి అంశాల‌పై జ‌గ‌న్‌కు లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే. ఈ హామీల‌ను నెర‌వేర్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/