భారత్‌లోను వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ నిలిపివేత!

డీసీజీఐ నోటీసు నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్‌ నిర్ణయం

Serum Institute halts coronavirus vaccine trials in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా టీకా ట్రయల్స్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) నిలిపివేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సూచనల మేరకు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను ఆపివేసినట్లు తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) దేశంలో 2, 3 దశలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. అయితే బ్రిటన్‌లో జరిపిన తుది దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టీకా వేసిన ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు.

ఈ నేపథ్యంలో ఈ ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇటీవల పేర్కొంది. దుష్రభావాలను నివారించేందుకు స్వతంత్ర కమిటీ సమీక్ష కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో చేపడుతున్న క్లినికల్ ట్రయల్స్‌ గురించి వివరణ ఇవ్వాలని ఎస్ఐఐని డీసీజీఐ కోరింది. దీంతో దేశంలో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు ఎస్ఐఐ తెలిపింది. అయితే ఇప్పటి వరకు చేపట్టిన క్లినికల్ ప్రయోగాల్లో ఎలాంటి అంవాఛనీయ ఫలితాలు ఎదురుకాలేదని పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/