భారత్‌లో తగ్గుముఖం పట్టిన శిశుమరణాలు

Child mortality rate declined in India between 1990 and 2019

జెనివా: ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో భారత్‌లో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. 1990-2019 మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, భారత్‌లో సంభవిస్తున్నాయని తెలిపింది. ‘చైల్డ్‌ మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్స్‌ 2020” పేరుతో ఐరాస నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1990లో అయిదేళ్ల లోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి వారి సంఖ్య 52 లక్షలకి తగ్గింది. అదే భారత్‌లో 34 లక్షల నుంచి 8 లక్షల 24వేలకి తగ్గింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/