బిజెపి ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై బాంబుల దాడి

బిజెపి ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై బాంబుల దాడి

బెంగాల్ లో ఈ మధ్య వరుసగా బిజెపి నేతల ఇళ్ల ఫై బాంబుల దాడి జరుగుతున్నాయి. బుధువారం ఉదయం బరాక్​పుర్ నియోజకవర్గ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. ఇంటి వద్ద డ్యూటీలో ఉన్న సీఆర్​పీఎఫ్ జవాను తృటిలో గాయాల నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఈ సమయంలో ఇంట్లో అర్జున్ సింగ్ లేరు.

ఆయన ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. వరుసగా మూడు బాంబులు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బంగాల్ గవర్నర్ జగ్​దీప్ ధన్​కడ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇది ముమ్మాటికీ టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపిస్తోంది.