విద్యుత్‌ బిల్లులు మూడు నెలలు వాయిదా?

రాష్ట్రాలను కోరనున్న కేంద్రం

electricity meters
electricity meters

దిల్లీ: కరోనా నేపధ్యంలో నిన్న రుణ గ్రహీతలకు 3 నెలలు వెసులుబాటు కల్పించింది ఆర్‌బిఐ. అయితే తాజాగా దేశంలో 3 నెలల పాటు విద్యుత్‌ బిల్లుల చెల్లింపును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కారణంగా కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తుంది. ఎటువంటి జరిమాన లేకుండా మూడు నెలల తర్వాత బిల్లులు చెల్లించే అవకాశం కల్పించనున్నారు. దీనిపై కేంద్ర ఇందన శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్‌ విద్యుత్‌ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీలకు, కేంద్ర విద్యుత్‌ రెగ్యులేటరి సంస్థ దీనిపై మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/