ఇండియాలో ట్రంప్‌ పర్యటన పూర్తి షెడ్యూల్‌

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: ఇండియాలో ట్రంప్ రేపు (24వ తేది) ఉదయం 11:55 కు అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు.ఎయిర్ పోర్టు నించి మోతేరా స్టేడియం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:30 కి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 3:30 కి ఆగ్రా వెళ్లనున్నారు. సాయంత్రం 5:10కి తాజ్ మహల్ సందర్శించనున్నారు. రాత్రి 7:30 కి పాలం ఎయిర్ పోర్టుకి చేరుకుని అక్కడి మౌర్య హోటల్ లో బస చెయనున్నారు.25వ తేదీన ఉదయం 9:55 కు రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. ఉదయం 10:45 కు రాజఘాట్ కు వెళ్లి, గాంధీకి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 11.25 కు హైదరాబాద్ హౌస్ కు చేరుకుని ట్రంప్ దంపతులు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి అనంతరం మోడీతో లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2:55 కు ట్రంప్ యూఎస్ ఎంబసీ సిబ్బందితో భేటి కానున్నారు.రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులతో విందు రాత్రి 10:00 గంటలకు ట్రంప్ దంపతులు యుఎస్ బయల్దేరనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/