విస్రృత ప్రచారం, సమన్వయంతోనే కరోనా నుండి విముక్తి

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపు

Governor Bishwa Bhushan Harichandan
Governor Bishwa Bhushan Harichandan

Amaravati:  కరోనాతో ఎదురవుతున్న ప్రస్తుత సవాళ్లను అధికమించేందుకు పౌర సంఘాలు, రెడ్ క్రాస్, స్వచ్ఛంధ సంస్ధలు ప్రచారాన్నే పరమావధిగా ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కునేందుకు ప్రజలు పాటించాల్సిన ఆరోగ్య నియమావళిని పెద్దఎత్తున ప్రచారం చేయడం ద్వారా మహమ్మారిని అరికట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించవలసి ఉందన్నారు. కరోనా కోరలు చాస్తున్న వేళ వెబినార్ ద్వారా విజయవాడ రాజ్ భవన్ నుండి 13 జిల్లాల జిల్లా సంయిక్త పాలనాధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ-ఎపి స్టేట్ బ్రాంచ్, జిల్లా శాఖల బాధ్యులకు గవర్నర్ దిశానిర్ధేశం చేసారు. తప్పనిసరిగా ముసుగు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించటం, తరచూ చేతులు కడుక్కోవడం, అర్హత ఉన్న వారంతా టీకా తీసుకోవడం వంటి అంశాలపై ప్రజలలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించవలసిన బాధ్యత రెడ్ క్రాస్ ప్రతినిధులపై ఉందన్నారు. 

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/