తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

శాంతి సౌభాగ్యాలు చేకూరాలని తెలుగులో ట్వీట్

ugaadi-President and Prime Minister wish the Telugu people
ugaadi-President and Prime Minister wish the Telugu people

New Delhi: ఉగాది పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం తెలుగులో ట్వీట్లు చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/