కరీంనగర్‌లో కరోనా కలకలం : మెడికల్ కాలేజీలో 43 మందికి కరోనా సోకింది

కరీంనగర్‌లో కరోనా కలకలం : మెడికల్ కాలేజీలో 43 మందికి కరోనా సోకింది

కరోనా మహమ్మారి మళ్లీ తన పంజా విసురుతుంది. ఓ పక్క కరోనా వాక్సిన్ దాదాపు అంత పూర్తయినప్పటికీ..కరోనా కేసులు మాత్రం మళ్లీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని చల్మెడ మెడికల్ కాలేజీకి చెందిన 43 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఇటీవల కళాశాల వార్షికోత్సవం జరిగినట్లు తెలుస్తోంది. వేడుకల అనంతరం విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో కళాశాల యాజమాన్యం పరీక్షలు నిర్వహించింది. వారిలో ఏకంగా 43 కేసులు పాజిటివ్‌‌గా తేలినట్లు సమాచారం. ఇంకొంతమంది కరోనా రిపోర్ట్స్ రావాల్సి ఉండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు నమోదు కావడంతో కాలేజీకి సెలవులు ప్రకటించినట్లు సమాచారం. ప్రస్తుతం స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.