కేరళలో దారుణం : మహిళపై గ్యాంగ్ రేప్..

కేరళలో దారుణం : మహిళపై గ్యాంగ్ రేప్..

ఎన్ని చట్టాలు వచ్చిన మహిళల ఫై అత్యాచారాలు , లైంగిక దాడులు ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఇలాంటి దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కేరళలో మహిళా ఫై గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది. గత వారం ఎర్నాకులం జిల్లా కొచ్చి నగరంలోని హోటల్‌లో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి సమాచారం మేరకు సాలిన్ కుమార్(31)న పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరు నిందితులు షామీర్, అజ్మల్‌గా గుర్తించారు.

డిసెంబర్ 2న సాలిన్ కుమార్ ఆహ్వానించడంతో సదరు మహిళ హొటల్‌కు వెళ్లారు. అప్పటికే మరో ఇద్దరు ఆ గదిలో ఉన్నారు. నిందితులు తనతో శీతల పానీయాలు తాగించారని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం గదిలో బంధించి తనను వీడియో తీశారని .. తనపై జరిగిన అత్యాచారం గురించి బయటకు చెబితే సోషల్ మీడియాలో వీడియో పెడుతామని బెదిరించారని ఆమె పోలీస్ పిర్యాదు లో తెలిపింది.