ఏపీలో 21వేలకు పైగా కేసులు, 89 మృతులు

కర్ఫ్యూ అమలు లో ఉన్నప్పటికీ కట్టడి కాని కరోనా

corona cases in AP
Corona cases in AP

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 20 వేలకు పైగా కరోనా కేసులు రికార్డు అయ్యాయి. 24 గంటల్లో 90,750 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 21,452 పాజిటివ్ కేసులు తేలాయి. 89 మృతి చెందారు. రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ అమలు లో ఉన్నప్పటికీ కరోనా కేసులు మాత్రం 20 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో 21వేలకు పైగా కేసులు, 89 మృతులు

విశాఖ జిల్లాలో 11 మంది మృతి చెందగా, . తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 9 మంది మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 8 మంది కారొనకు బలయ్యారు.పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు శ్రీకాకుళం జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో నలుగురు మృతిచెందారు.

ఏపీలో 21వేలకు పైగా కేసులు, 89 మృతులు
Covid cases bulletin-Guntur District

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/