భారత మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని అంచానా వేస్తున్నాం

న్యూఢిల్లీ: భారత మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఫైనాన్షియల్ మార్కెట్లపై వైరస్ ప్రభావాన్ని మదింపు చేయడంతో పాటు అవి సజావుగా పని చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం నెలకొన్న క్రమంలో ఆర్‌బిఐ తాజా ప్రకటనను జారీ చేసింది. కరోనా వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయని పేర్కొంది. మార్కెట్లలో విశ్వాసాన్ని పెంచి, సుస్ధిరతను కొనసాగించేందుకు నిర్ధిష్ట చర్యలు చేపట్టేందుకు సిద్ధమని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/