ఆర్బీఐకి నూతన డిప్యూటీ గవర్నర్‌

మైఖేల్ పాత్రాను నియమిస్తూ ఉత్తర్వులు

Michael Patra-RBI
Michael Patra-RBI

న్యూఢిల్లీ: (ఆర్బీఐ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిప్యూటీ గవర్నర్ గా సీనియర్ ఆర్థిక వేత్త మైఖేల్ పాత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్బీఐలో పరపతి విధాన విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్బీఐలో నాలుగో డిప్యూటీ గవర్నర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ పదవికి పాత్రాను ఎంపిక చేయవచ్చని ముందునుంచే భావిస్తున్నారు. పాత్రా నియామకంపై ఈ ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు సంవత్సరాల పాటు ఆయన తన పదవిలో కొనసాగనున్నారు. గత సంవత్సరం జూలైలో డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య రాజీనామా తరువాత నాలుగో డిప్యూటీ గవర్నర్ పోస్టు ఖాళీగా ఉందన్న సంగతి తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/