ఏపీలో కమ్మ రాజ్యం ఏర్పటుకు ట్రై – వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Kodali Nani

ఆంధ్రప్రదేశ్ లో కమ్మ రాజ్యం ఏర్పటు చేసేందుకు నారా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ట్రై చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ మంత్రి కొడాలి నాని. గత మూడు, నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఒక వ్యక్తి మానసిక పరిస్థితి కోల్పోయి పిచ్చెక్కినటు వంటి ప్రసంగాలు చూస్తున్నార‌న‌ని చంద్రబాబు ఫై నాని విమ‌ర్శించారు. జగన్ దెబ్బకు పిచ్చెక్కిపోయిన వ్యక్తి మన రాష్ట్రాన్ని 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వెన్నుపోటుదారుడు. అవినీతి చక్రవర్తి. రాష్ట్ర విభజనకు కారకుడు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసారు అంటూ మండిపడ్డారు.

చంద్రబాబునాయుడుగారిని నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మాలంటే నీ మీద నీకు నమ్మకం ఉందా. నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉందా. నీ కొడుకు పనికిరానటువంటి చవట. దద్దమ్మ. సన్నాసి. ఈ పార్టీని గట్టెక్కించలేడు. వీడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇలాంటి వాడు నా కడుపున పుట్టాడు. ఇటువంటి వ్యక్తిని నమ్ముకుంటే పార్టీ సర్వనాశనం అవుతుందని చెప్పి భావించే కదా, నీ దత్తపుత్రుడిని మళ్లీ లైన్‌ చేసుకుంటున్నావు. రా రా మళ్లీ కలిసి పోటీ చేద్దామంటున్నావు. నీ కొడుకు మీద నమ్మకం లేదు. లక్షల మంది టీడీపీ కార్యకర్తలకూ నమ్మకం లేదు. చంద్రబాబు చేతిలో పవన్ ఓ గంగిరెద్దు లాంటి వాడని విమర్శించారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా బడుగు వర్గాలకు అండగా ఉంటుందని, కానీ పవన్ మాత్రం కమ్మ వర్గానికే అండగా ఉంటున్నాడని మండిపడ్డారు.

కమ్మవారికి మద్దతుగా ఉంటా. వారిని కంటికి రెప్పలా కాపాడతానని పవన్‌కళ్యాణ్‌ చెప్పాడు. అసలు ఏ కమ్మ వ్యక్తి పోయి తమకు రక్షణ లేదని పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారో చెప్పండి. బహుషా పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేసి ఉంటాడు, జగన్‌గారు మా కమ్మరాజ్యం కూల్చేశాడని. తాను అధికారంలో ఉంటే, అన్ని ముఖ్య పదవులు కమ్మవారికి ఇచ్చి ఉండేవాడినని చెప్పుకుని ఉంటాడు. లేకపోతే రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్‌ నాయుడు ఫిర్యాదు చేసి ఉంటారు. అసలు వీరేనా కమ్మ వారు. ఆ నలుగురు జగన్‌గారిని ఎలాగైనా అధికారం నుంచి దింపేయాలని విపరీతంగా కష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఆ నలుగురు మాత్రమే కమ్మవారున్నారని పవన్‌కళ్యాణ్‌ అనుకుంటున్నాడేమో అని నాని అన్నారు.