రోజురోజుకూ పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్ర లో అత్యధికంగా 1,367 నమోదు

Corona and omicron cases increasing day by day
corona tests-File

New Delhi: దేశంలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు గంట గంటకు పెరుగుతున్నాయి. ప్రతిరోజు కరోనా కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరిగాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరింది. మొత్తం 2,162 మంది బాధితులు ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. దేశంలో 1,367 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, 792 కేసులతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479, పశ్చిమ బెంగాల్‌లో 294, యూపీలో 275 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 260, గుజరాత్ లో 236, తమిళనాడులో 185 కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 61 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి .

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/