జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ దుర్మరణం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విషాదం చోటచేసుకుంది. కాటారం మండల పరిధిలోని నస్తుర్‌పల్లిలో కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడు. నస్తుర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు అక్కడి వెళ్లాడు. ఈ క్రమంలో వణ్య ప్రాణులు వేట కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి కానిస్టేబుల్ ప్రవీణ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.
ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కరెంట్ షాక్ ట్రాప్‌ను పెట్టిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.