చేతుల అందానికి
అందమే ఆనందం
ఒక స్పూన్ రోజ్‌వాటర్‌లో రెండుచుక్కలు గ్లిజరిన్ కలిపి స్నానం చేసిన తర్వాత చేతులకు మర్దన చేసుకుంటే నలుపుపోయి నున్నగా, తెల్లగా ఉంటాయి.
- పెదాలు పగిలి నల్లగా ఉంటే ఒక చుక్క గ్లిజరిన్ వేలుమీద వేసుకొని పూసారంటే (పెదాలమీద) పగుళ్లు పోయి గులాబీలాగా ఉంటుంది.
- గులాబీరేకుల రసాన్ని ముక్కుల్లో పిండినచో తల నొప్పి తగ్గుతుంది.
- రాత్రినిద్రపోయేటప్పుడు ఒక పువ్వు రేకులను తింటే మోషన్ ఫ్రీగా అవుతుంది. శరీరానికి బం, కండరాలకు శక్తిని కలగజేస్తుంది.
- నేలమీదగానీ, ఇంకెక్కడైనాకాని నూనె ఒలికితే చేతులు జిడ్డులు జిడ్డులుగా ఉండకుండా ఉండాలంటే, నూనె ఒలికినచోట టేబుల్సాల్టును చల్లండి. పది,పదిహేను నిమిషాలు పాటుంచి, తర్వాత తుడిస్తే నూనెమరకలు కన్పించవు.
- మీ బంగారునగలు క్లీన్ చేయాలంటే, ఒక స్టీలు గిన్నెలో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా బ్లూ డిటర్జెంట్ పౌడర్ సరిపడ నీరు పోసి దానిలో నగలు వేసి, బాయిల్ అయ్యాక టూత్‌బ్రష్‌తో బ్రష్చేస్తే కొత్త వాటిలా తళతళలాడ్తాయి.
- కరేపాకు నిల్వ ఉండాంటే ఒక సీసాలో వేసి మూతపెట్టే ఉంటుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/