బాలకృష్ణ కు ‘గ్లోబల్ లయన్’ బిరుదు ఇచ్చిన అనిల్ రావిపూడి

జూన్ 10 న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్బంగా అభిమానులు మూడు రోజుల ముందు నుండే సోషల్ మీడియా లో పుట్టిన రోజు సంబరాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘గ్లోబల్ లయన్’ బిరుదును ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు. ‘నందమూరి బాలకృష్ణ బర్త్‌డే వేడుకలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. బాలకృష్ణ గారి అభిమానుల తరఫున ఆయన గౌరవ బిరుదు ‘గ్లోబల్ లయన్’ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలకృష్ణ 108 మూవీ కి డైరెక్ట్ చేస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తాలూకా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు. బాలకృష్ణ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాల్లో ఒకటైన ‘నరసింహనాయుడు’ను జూన్ 10న రీరిలీజ్ చేస్తున్నారు. 4కె క్వాలిటీతో విడుదలవుతోన్న ఈ సినిమా రీరిలీజ్ ట్రెండ్ అప్పుడే ట్విట్టర్‌లో మొదలైపోయింది.