రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70-80 సీట్లు సాధిస్తుంది – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 నుండి 80 సీట్లు సాదిస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఆలా రాకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద ఎంపీ మంగళవారం పార్టీ కార్యకర్తల సమక్షంలో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70-80 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో వర్గపోరు లేదన్న ఆయన, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఈ నెల 26న ముఖ్యనాయకులతో రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం అవుతారన్నారు. 10 రోజుల్లో ప్రియాంకతో నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.