నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్‌ నగదు జమచేయనున్నారు. ఉదయం 8.30 కు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడ నుంచి ఉ 8.40 కు బయలుదేరి కొవ్వూరు కు కే జీ ఎం హై స్కూల్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ఉ.9.20 కు చేరుకుంటారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులను కలుస్తారు.

ఇక్కడ నుంచి ఉ.9 30 కు బయలుదేరి రోడ్ షో గా సత్యవతి నగర్ లోని బహిరంగ సభ .. సభావేదిక కు ఉ.9.40 కు చేరుకుంటారు. ఉ.9.45 నుంచి ఉ.11.15 కు సభాస్థలి కార్యక్రమంలో ఇక్కడ లబ్ధిదారులతో ముఖాముఖి, ప్రముఖుల సందేశాలు, ముఖ్యమంత్రి సందేశం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉ.11.20 కు సభా వేదిక నుంచి బయలుదేరి ఉ.11.30 కు కొవ్వూరు – హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఉ.11.30 నుంచి మ.12.00 వరకు స్థానిక ప్రజా ప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.