తెలంగాణ లో నేడు , రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్త. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర ప్రజలు విపరీతమైన ఎండతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. ఏ పని ఉన్న తొమ్మిది లోపే చేసుకుని ఇంటికి వస్తున్నారు. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయో అని అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలి పింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు అక్కడక్కడా పడతాయని, గురువారం పొడి వాతావరణం నెలకొంటుందని ప్రకటించింది.