కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సన్నాహాలు.. 3, 4 రోజుల్లో షెడ్యూల్

న్యూఢిల్లీః కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మూడు, నాలుగు రోజుల్లో వెలువడే అ అవకాశం ఉంది. వచ్చే నెల 20 నాటికల్లా నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలిపింది. అయితే.. తుది తేదీలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదించాల్సి ఉందని కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని రాహుల్ గాంధీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాహుల్ నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/