మునుగోడు మండ‌లాల‌కు ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్

మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తాజాగా అధిష్టానం మునుగోడు ఉప ఎన్నిక బరిలో పాల్వాయి స్ర‌వంతి ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ గెలుపుకు అంత కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. కాగా తాజాగా మండలాలకు సంబదించిన కాంగ్రెస్ ఇంచార్జీలను నియమించింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఓ మండ‌లానికి ఇంచార్జీగా వ్యవహరించబోతున్నారు. ఈ మేర‌కు ఇంచార్జీల జాబితాను సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసింది. జాబితా ప్రకారం చూస్తే.. రేవంత్ రెడ్డి నారాయ‌ణపుర్‌ మండ‌ల ఇంచార్జీగా, నాంప‌ల్లి మండ‌లానికి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, చౌటుప్ప‌ల్ ఇంచార్జీగా న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఇంచార్జీగా టీసీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మ‌ర్రిగూడ ఇంచార్జీగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, చండూరు ఇంచార్జీగా ష‌బ్బీర్ అలీ, గ‌ట్టుప్ప‌ల్ ఇంచార్జీగా వి.హ‌న్మంత‌రావు, చౌటుప్ప‌ల్ మునిసిపాలిటీ ఇంచార్జీగా మాజీ మంత్రి గీతారెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వస్తానని హమో ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన స్రవంతి ప్రచారానికి రావాల్సిందిగా కోరగా..వస్తానని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో..మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బిజెపి నుండి ఆయన బరిలోకి దిగుతుండగా..కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుంది.