టిఆర్‌ఎస్‌ మంత్రి అక్రమాలు శృతి మించి పోయాయి

కెటిఆర్‌ అక్రమాలకు మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శనం

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అక్రమాలు శృతి మించిపోయాయని కాంగ్రెస్‌ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. కెటిఆర్‌ ఎన్నికల అక్రమాలకు నేరేడుచెర్ల మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శమన్నారు. ఇది ఎన్నికల అక్రమాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. 25వ తేదీ వరకే ఎక్స్‌ అఫిషియో సభ్యుల నమోదు జరగాలని నిబంధన ఉందన్నారు. ఇవాళ నేరేడు చెర్ల మున్సిపల్‌ సభ్యులుగా సుభాష్‌రెడ్డి పేరును నమోదు చేశారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇది అక్రమం, నిబంధనలకు విరుద్దమని..ఇక ఎన్నికల ఎందుకు జరపాలని ఉత్తమ్‌ నిలదీశారు. కెటిఆర్‌ ఇంట్లో కుర్చుని రాసుకుంటే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/