మల్లన్న ఫై మరో కేసు..ఈసారి ఎవరు పెట్టారంటే

మల్లన్న ఫై మరో కేసు..ఈసారి ఎవరు పెట్టారంటే
teenmaar-mallanna

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు ఫై మరో కేసు నమోదైంది. తన నుంచి తీన్మార్ మల్లన్న రూ. 5 లక్షలు, ఉప్పు సంతోష్ రూ. 20 లక్షలు డిమాండ్ చేశారంటూ నిజామాబాద్‌కు చెందిన ఓ కల్లువ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు సంతోష్‌ను ఎ1గా, నవీన్‌ను ఎ2గా చేర్చారు. అనంతరం సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోపక్క మల్లన్న భార్య మాతమ్మ కేంద్ర హోంహాఖ మంత్రి అమిత్ షాను కలిసింది. తన భర్త ఫై అక్రమంగా కేసులు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక కేసులను ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టు చెప్పారు. కేసుల ద్వార తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని వివరించారు. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతూ జైలుకు పంపే విధంగా కుట్రకు తెరలేపారని చెప్పారు. దీంతో నేటి వరకు మల్లన్నపై 35 కేసులను నమోదు చేశారని.. ఒకకేసులు బెయిల్ వచ్చిన వెంటనే మరోకేసు పెట్టినట్టు ఆమె తెలిపింది. ఇక మల్లన్న బిజెపి పార్టీ లో చేరబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జైలు నుండి బయటకు రాగానే అధికారంగా బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు.