నేడు పార్టీ ఎంపిలతో చంద్రబాబు సమావేశం

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే నేటి మధ్యాహ్నం అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాజధాని రైతుల ఆందోళనలు, అమరావతి జేఏసీ కార్యక్రమాలపై చర్చించనున్నారు. మండలి రద్దుపై ప్రభుత్వం తీర్మానం చేసిన తరుణంలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/