సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Congress leaders, PM Modi greet Sonia Gandhi on her 77th birthday

న్యూఢిల్లీః నేడు యూపీఏ చైర్‌ప‌ర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో సోనియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కాంగ్రెస్‌ నాయకురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం సోనియాకు గ్రీటింగ్స్‌ తెలియజేశారు. ‘సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ మోడీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మోడీతో పాటుగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.