డాక్టర్ల సాయంతో నడుస్తున్న కెసిఆర్‌

ఆపరేషన్ నిర్వహించిన యశోదా ఆసుపత్రి వైద్యులు

kcr-walking-in-presence-of-doctors

హైదరాబాద్ః తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్సను నిర్వహించి, స్టీల్ ప్లేట్లను అమర్చారు. మరోవైపు, వాకర్ ఆధారంగా కెసిఆర్ నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నడవడాన్ని వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.