కీలక బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ

సహకరించాల్సిందిగా ఫ్యాన్స్‌ను కోరుతున్న హిట్‌మ్యాన్‌

Rohit Sharma
Rohit Sharma

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కీలక బాధ్యతలు చేపట్టాడు. అదే… భారత ఖడ్గమృగాల్ని కాపాడే బాధ్యత. మీకు తెలుసు… మన దేశంలోని కొమ్ము ఖడ్గమృగాలు… అరుదైనవి. అవి మన దేశానికే సొంతం. ఒకప్పుడు… లక్షల్లో ఉండే ఈ రైనోలు…. ఇప్పుడు 20వేల కంటే తక్కువే ఉన్నాయి. ఫలితంగా ఇవి రెడ్ లిస్ట్ (అంతరించిపోయే జాతుల జాబితా)లో చేరిపోయాయి. ఇందుకు అనేక కారణాలు. ఒకటి వేటగాళ్లు. రెండోది… తగ్గిపోతున్న అడవులు. వేటగాళ్ల చర్యల్ని చాలా వరకూ… అసోం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నాయి. ఐతే… అడవుల్లో భాగమైన… అల్యూవియల్ గడ్డి మైదానాల్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గడ్డి లేకపోవడం వల్ల చాలా ఖడ్గమృగాలు చనిపోతున్నాయని తెలిసింది. ఈ గడ్డి మైదానాల్ని పెంచేందుకు… వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్‌)ఇండియా… ప్రయత్నిస్తోంది. పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా… టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సాయం తీసుకుంటోంది. అతని ద్వారా ప్రచారం చేయిస్తోంది. ఖడ్గమృగాల్ని కాపాడదామని పిలుపుస్తున్న రోహిత్ శర్మ… విరాళాలు ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్‌ని కోరుతున్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/