కర్ణాటక ఎన్నికల ఫలితాలు..ముందంజలో కాంగ్రెస్‌

congress-crosses-magic-figure-in-karnataka-election-results

బెంగళూరుః దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ పార్టీ 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార బిజెపి 79 స్థానాల్లో.. జేడీఎస్‌ 26 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. బెంగళూరు సహా దేశరాజధాని ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. డ్యాన్సులు చేస్తూ, డప్పు వాయ్యిధ్యాలతో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.