బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి గుండెపోటు

80, 90ల్లో బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన మాస్ హీరో మిథున్ చక్రవర్తి అనారోగ్యం పాలయ్యారు. గుండెనొప్పితో ఆయన ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మిథున్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ భూషణ్‌’ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్‌ చక్రవర్తి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. మిథున్‌ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు.

సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్‌ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలలో దుమ్మురేపిన మిథున్‌ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ చిత్రంలో మిథున్​ మెప్పించిన విషయం తెలిసిందే.