పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు !
పిల్లలు- పోషణ

పిల్లలను ధైర్యంగా ఆత్మవిశ్వాసం గల వారిగా పెంచడం అత్యవరం అప్పుడే వాళ్లు ప్రతి పనిలో చురుగ్గా సాగుతారు. పిల్లలను దైర్య వంతులుగా మలిచేందుకు సైకాలజిస్టలు చెబుతున్న సూచనలివి.
్ద పిల్లలు ఏ విషయాలను బయపడతారో తెలుసుకోవాలి.
వారిలోని భయాలను పోగొట్టాలి. అప్పుడే వారు ఏ విషయాన్నై తల్లిదండ్రులతో పంచుకుంటారు.
ఓటమిని కూడా గెలుపుతో సమానంగా అంగీకించాలని పిల్లలకు చెప్పాలి. లేదంటే వాళ్లు ఎందులోనైనా ఓడిపోయినప్పుడు తీవ్ర నిరాశకులోనయూ అవకాశముంది.
కొత్త పనులు, వారికి ఇష్టమైనవి నేర్చుకొనేందుకు పిల్లలను ప్రోత్సమిస్తూ ఉండాలి.
పిల్లలు పెద్ద విజయాలు సాధించాలని కోరుకోవడం మంచిదే.
అయితే వారు గొప్పగా చేసిన ప్రతి చిన్న పనిని మెచ్చుకోవాలి. వారు చిన్న బహుమతి గెలిచినా కూడా అభినందించడం. ప్రయత్నించి ఓడిపోయినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సమించడం ఎంతో ముఖ్యం.
తోటి పిల్లలతో పోల్చడం ఒక్కోసారి అత్యన్యూనతకు లోనుచేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ పిల్లల ప్రతిభ గుర్తించి ఆ దిశగా నడిపించాలి.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/