ధైర్యంతో ముందడుగు

జీవన వైవిధ్యం

Tarani Team
Tarani Team


సముద్ర మంత తెగువ.. అవధులులేని ఆత్మ విశ్వాసం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన.. సాగరం చిన్నచోయేలా.. సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవొని దైర్యంతో ముందడుగు వేస్తూ.. తిమిరంతో సమరం చేస్తూ కదన రంగంలోనూ సరిలేరు మాకెవ్వరంటూ భారత నౌకాదళంలో తమ శకాన్ని లిఖిస్తున్నారు మహిళలు..

నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ వర్తింపజేయ్యాలన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటినుంచి నౌకాదళంలో మహిళా శకం మొదలైంది.

లింగసమానత్వానికి సరికొత్త నిర్వచానన్ని తిరగరాస్తూ..

యుద్ధనౌకల్లో మహిళా అధికారుల్ని నియమించి కొత్త అధ్యాయానికి భారత నౌకాదళం తెరతీసింది. తొలి మహిళా పైలట్‌గా శివాంగి నియామకంతో సముద్రమంత ఉత్సాహం మహిళల్లో నెలకొంది.

ఆ తర్వాత కొద్ది కాలానికే.. యుద్ధ నౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్‌లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితీసింగ్‌లు అడుగు పెట్టడంతో.. ఆత్మ విశ్వాసం రెట్టంపైంది. నౌకాదళం అమ్ముల పొదిలో చేరిన అత్యాధునిక ఎంహెచ్‌-60 ఆర్‌ హెలికాప్టర్లలో మీరు విధులు నిర్వరిస్తున్నారు.

వీరి నియామకంతో సైన్యంలో మహిళలకు సమ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపించారు. ఫ్రంట్‌లైన్‌ యుద్ధనౌకలపై మహిళా అధికారులు మోహరించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ..

ఇప్పటి వరకూ నిర్మించిన ఏ యుద్ధ నౌకలోనూ మహిళలకంటూ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయ్యలేదు. కనీసం మహిళల కోసం ఏ ఒక్క యుద్ధ నౌకలోనూ ప్రత్యేక టాయిలెట్స్‌ లేవంటే.. తమకు యుద్ధ నౌకల్లో పనిచేసే అర్హత లేదన్నట్లుగా భావించారన్న అనుమానాలు మహిళాలోకంలో వ్యక్తమవుతున్నాయి.

అయితే.. మారుతున్న కాలానికనుగుణంగా నౌకా నిర్మాణంలోనూమార్పులు రానున్నాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ ఎకె జైన్‌ నేవీ డే సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే.. యుద్ధ నౌకల్లో మహిళల ప్రవేశం లాంఛనమైన నేపథ్యంలో.. వారికి కావల్సిన సౌకర్యాలతో నౌకల్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.

తరిణి స్ఫూర్తితో బుల్‌ బుల్‌..

గోవా నుంచి కేప్‌టౌన్‌కు సెయిలింగ్‌ బోట్‌లో వెళ్లి తిరిగి దేశానికి చేరుకుంటూ.. భారతీయ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఐఎన్‌ఎస్‌ వి తరిణి మహిళా బృందం చేసిన సాహసయాత్ర.. నౌకాదళంలోని మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది.

సుమారు 21 వేల నాటికల్‌ మైళ్ల దూరం.. ఐదు మహా సముద్రాలు, ఐదు అంచెల ప్రయాణం.. ఆరుగురు మహిళలు కలిసి.. భారతీయ మహిళలు అత్యంత శక్తివంతులని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే లక్ష్యంగా సాగిన ‘నావికా సాగర్‌ పరిక్రమ..

ఆసియాలోనే తొలిసారిగా కేవలం ఆరుగురు మహిళలతో కూడిన సెయిలింగ్‌ బోట్‌ సాహస యాత్ర ఇది. ఇండియన్‌ నేవీల వివిధ స్థాయిల్లో పని చేస్తున్న ఉద్యోగునుల్లో 20 మందిని వివిధ పరీక్షల అనంతరం ఈ యాత్రకోసం ఆరుగురిని ఎంపిక చేశారు.

తరిణి సారధిగా లెఫ్టినెంట్‌ కమాండర్‌ వర్తకా జోషి వ్యవహరించగా లెఫ్టినెంట్‌ కమాండర్‌ ప్రతిభా జమ్వాల్‌, లెఫ్టినెంట్‌ కమాండర్‌ పాతర్లపల్లి స్వాతి, లెఫ్టినెంట్‌లు విజయదేవి, లెఫ్టినెంట్‌ పాయల్‌ గుప్తా, లెఫ్టినెంట్‌ ఐశ్వర్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి ఈ యాత్ర అందించిన స్ఫూర్తి..

నౌకాదళంలో మహిళలకు సముచిత స్థానంకల్పిం చడంలో కీలకపాత్ర పోషించింది. తరిణి సాహసయాత్రని స్ఫూర్తి తీసుకొని మరో యాత్రకు మహిళల్ని పంపించేందుకు భారత నౌకాదళం సమాయత్తమవుతోంది. ఈ సాహస యాత్రకు బుల్‌బుల్‌ అనిపేరు పెట్టినట్లు అధికారులు ప్రకటించారు.

ఈ సాహసయాత్రకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొదలైందనీ.. త్వరలోనే బుల్‌బుల్‌ యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా. నౌకా దళంలో మహిళపాత్ర అత్యవసరం. ఆవశ్యకం
అన చాటి చెప్పనున్నారు.

మహిళల అంకితభావానికి హ్యాట్సాఫ్‌ …

‘లింగభేదాన్ని సమూలంగా చెరిపేసేందుకు నౌకాదళం మహిళలకు పెద్ద పీట వేస్తోంది. యుద్ధనౌకల్లో క్రమం గా మహిళల ప్రాధాన్యం పెరిగే రోజులు సమీపంలోనే ఉన్నాయి ఇప్పటికే వివిధ శాఖల్లో 9 నుంచి 10 మహిళా అధికారులను శాశ్వతంగా నియమించే ప్రక్రియ మొదలైంది.

అయితే సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు యుద్ధనౌకల్లో మహిళలకు సరైన మౌలిక వసతులు లేవు. ఇప్పుడా మచ్చ చెరిగి పోతుంది. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, వనరులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

కేవలం వృత్తిపరంగానే కాకుండా. సాహసయాత్రల్లోనూ వారిది పై చేయిఉండాలని సంకల్పించాం. ఇప్పటికే ఐఎన్‌ఎస్‌వి తరిణి సాహస ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసున్నారు.

ఇదే స్ఫూర్తితో త్వరలో బుల్‌బుల్‌ ప్రారంభం కానుంది. మహిళా అధికారులు నౌకాదళంఓ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రదర్శిస్తున్న అంకిత భావానికి హ్యాట్సాప్‌.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/