వైస్సార్సీపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారంటూ బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

వైస్సార్సీపీ కి చెందిన పలువురు నేతలు మాతో టచ్ లో ఉన్నారంటూ తెలిపి షాక్ ఇచ్చారు సినీ నటుడు , హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నేడు హిందూపురం నుంచి భారీ కాన్వాయ్‌తో గార్లదిన్నె మండలం మర్తాడు శివారు క్యాంప్ సైట్‌కు బాలకృష్ణ చేరుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొననున్నారు. దీనికి ముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో చెత్త ప్రభుత్వం ఉందని..రాష్ట్రంలో డ్రగ్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందన్నారు. సీఎంకి మెగా బైట్‌కు, గిగా బైట్‌కు తేడా తెలియదని సెటైర్లు పేల్చారు. జగన్‌కు పాలన చేతకాదని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. సలహాదారుల సలహాలు తీసుకోరని.. సలహాదారులంతా ఒకే సామాజికవర్గానికి చెందినోళ్లు ఉన్నారన్నారు. జనం అటే జగన్‌కు కక్ష.. అదో రకం సైకో తత్వం అన్నారు.

ఓటే మీకు ఆయుధం. అదే మీకు రక్షణ. రాష్ట్రంలో రాజధాని ఎక్కడుంది? బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ? వంటివి చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకూ పోలవరం ఊసే ఎత్తలేదు. రూ.8 లక్షల కోట్ల అప్పులు ఎవడబ్బ సొమ్ము? సరే చేశారు. దానితో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంతా శూన్యం. పెన్షన్లు పెండింగ్.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైఎస్సార్‌సీపీ కుట్ర అన్నారు. తాను సైకాలజీ చదవలేదు కానీ.. తాను పెద్ద సైకాలజిస్ట్ అంటూ కామెంట్ చేశారు. కులాల ఉచ్చులో పడొద్దని.. టీడీపీని గెలిపించుకుందాం, లేకుంటే ఓటే వేటు అవుతుందన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. అన్ని వర్గాలు లోకేష్‌కు మద్దతుగా తరలి వస్తున్నారన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కళ్లు తెరవాలని.. భవిష్యత్ కోసం ఓటునే ఆయుధంగా చేసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.