హిందీ పేపర్‌ లీక్‌ పై సీపీకి ఫిర్యాదు చేశాం: వరంగల్‌ డీఈవో

Complaint to CP on Hindi paper leak: Warangal DEO

వరంగల్‌: తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో మరో ప్రశ్నపత్రం లీకైంది. రెండో రోజు హిందీ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ఆ పేపర్‌ వాట్సాప్‌లో వైరల్‌ అయింది. హిందీ ప్రశ్నపత్రం బయటకు ఎలా వెళ్లిందనే విషయంపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ‘‘వాట్సాప్‌లో ఉన్న ప్రశ్నపత్రం ఇవాళ జరిగిన పరీక్షతో సరిపోలింది. ప్రశ్నపత్రం ఎక్కడ్నుంచి వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నాం. వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేశాం’’ అని డీఈవో వాసంతి తెలిపారు. అయితే అంతకుముందు మంత్రి సబిత ఘటనపై ఆరా తీయగా.. లీక్ కాలేదని వరంగల్‌, హనుమకొండ డీఈవోలు వివరించిన విషయం తెలిసిందే.