నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె పెళ్లిలో మెగా బ్రదర్స్ సందడి

ప్రముఖ నిర్మాత , బిజినెస్ మాన్ సునీల్ నారంగ్ కుమార్తె పెళ్లి హైదరాబాద్ లో గత రాత్రి అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ లో అత్యంత ఖరీదైన ఎఫైర్ గా సాగిన ఈ వేడుకలో వరుడు ఆదిత్యతో కలిసి జాన్వీ ఏడడుగులు వేసింది. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా ఈ వేడుకలో మెగా బ్రదర్స్ మెగా స్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కలిసి రావడం ఫంక్షన్ లో హైలైట్ గా నిలిచింది. నాగార్జున- పవన్ కళ్యాణ్- గోపీచంద్ – శివ కార్తికేయన్- నాగ చైతన్య తదితర హీరోలు అటెండ్ కాగా.. దర్శకుల్లో శేఖర్ కమ్ముల- త్రివిక్రమ్-ప్రశాంత్ వర్మ వేదిక వద్ద కనిపించారు.

ఏషియన్ సినిమాస్ అధినేతలతో భాగస్వామి అయిన దగ్గుబాటి సురేష్ బాబు వేదిక వద్ద ఎంతో సందడిగా కనిపించారు. ఆయనతో పాటు పలువురు హాజరయ్యారు. నూతన వధూవరులు జాన్వీ- ఆదిత్యలను ఆశీర్వదించారు. దర్శకుడు త్రివిక్రమ్ తో వివాహానికి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఆల్-వైట్ లుక్ లో కనిపించారు. చై తెల్లటి ఫార్మల్ షర్ట్ బ్లూ ప్యాంట్ లో ఎప్పటిలాగే డాషింగ్ గా కనిపించగా నాగార్జున ఫార్మల్ లుక్ వచ్చారు. తండ్రీకొడుకులు నాగార్జున అక్కినేని – నాగ చైతన్య ను కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు.