దుబ్బాక..8వ రౌండ్‌లో బిజెపి ఆధిక్యం

3,106 ఓట్ల లీడింగ్ లో రఘునందన్ రావు

TRS party
TRS party

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు గంట గంటకు ఉత్కంఠ రేపుతున్నాయి. తొలి ఐదు రౌండ్లలో వెనుకపడిపోయిన అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఆ తర్వాత పుంజుకుంది. ఆరు, ఏడు, రౌండ్లలో ఆధిక్యతను సాధించి ఉత్కంఠను పెంచింది. అయితే ఎనిమిదో రౌండులో బిజెపి మళ్లీ పైచేయి సాధించింది. ఎనిమిదో రౌండులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు 621 ఓట్ల మెజార్టీని సాధించారు. ఎనిమిదో రౌండ్ ముగిశాక బిజెపి ఆధిక్యత 3,106కి చేరింది. మరోవైపు మంత్రి హరీశ్ రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చేదు అనుభవం మిగిలింది. ఉత్తమ్ దత్తత తీసుకున్న లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ కు కేవలం 163 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ గ్రామంలో బిజెపికి 490, టిఆర్ఎస్ కు 520 ఓట్లు వచ్చాయి. మరోవైపు హరీశ్ రావు దత్తత తీసుకున్న చీకోడు గ్రామంలో టిఆర్ఎస్ కంటే బిజెపి 22 ఓట్ల ఆధిక్యతను సాధించింది.

ఎనిమిదో రౌండ్‌లో టిఆర్ఎస్ పార్టీ 2495 ఓట్లు సాధించ‌గా, బిజెపి 3116, కాంగ్రెస్ 1122 ఓట్లు సాధించింది. ఎనిమిది రౌండ్లు పూర్త‌య్యే స‌రికి టిఆర్ఎస్ పార్టీకి 22772 ఓట్లు, బిజెపికి 25878 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 5125 ఓట్లు పోల‌య్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/