రేపే కౌంటింగ్..అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తాలూకా కౌంటింగ్ రేపు జరగనుంది. నెల రోజుల పాటు క్షణం తీరిక లేకుండా ప్రచారం చేసిన అభ్యర్థుల భావిత్వం..ప్రస్తుతం ఓటింగ్ మిషన్ లో ఉంది. రేపు ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలుకాబోతుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార పార్టీ కి వ్యతిరేకంగా రావడం తో అధికార పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం అవుతాయా..? లేదా ..? అనేదానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.