ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి సొంత ఇల్లు

మంత్రి కేటీఆర్ వెల్లడి

Home to fluoride victim Ansala swamy
Home to fluoride victim Ansala swamy

Hyderabad: నల్గొండ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి సొంత ఇల్లు చేకూరనుంది. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (హెయిర్ కటింగ్ సెలూన్) ని ఏర్పాటు చేయించిన మంత్రి కేటీఆర్ ఈరోజు అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లుని అందించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం వైపు నుంచి అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ఇల్లు మంజూరు చేయాలని స్థానిక జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ కు అంశాల స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా తన సొంత ఊరు పరిసర గ్రామ నివాసి అయిన అంశాల స్వామికి పక్కా ఇల్లు అందించేందుకు విద్యాసాగర్ ముందుకొచ్చారు. ఈమేరకు అంశాల స్వామి మంత్రి కేటీఆర్ ని భవన్ లో కలిశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/