15న కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్రహావిష్కరణ

సూర్యాపేట: దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఈ నెల 15న సూర్యాపేట పట్టణంలో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌ రెడ్డి పరిశీలించారు. తెలంగాణకు, సూర్యాపేట గడ్డకు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కాగా, గత జూన్‌లో లఢక్‌లోని గల్వాలన్‌ లోయలో చైనా ఆర్మీతో జరిగిన పోరాటంలో ప్రాణాలొదిలిన విషయం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/