వర్మ ఫై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు కేసులు కొత్తమీ కాదు..నిత్యం ఏదొక వివాదస్పద కామెంట్స్ చేయడం లో వార్తల్లో నిలువడం ఆయనకు అలవాటే. ఇప్పటీకే చాల పోలీస్ స్టేషన్ లలో అయన ఫై పలు కేసులు నమోదు కాగా..తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ అలాగే స్వామి వివేకానంద ఫై పలు వివాదస్పద ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా వివేకానందడిని ఆదర్శంగా తీసుకునే భారతీయులకు, యువకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వర్మ పోస్టులున్నాయంటూ ఏబీవీపీ విద్యార్థులు వర్మపై కేసు పెట్టారు. నిత్యం ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారతీయ సంస్కృతిపై దాడి చేయడం వర్మకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వారాహి ఫై మంగళవారం రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ను స్వామి వివేకానందతో పోల్చిన వర్మ… అలాంటి పవన్ కళ్యాణ్.. హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. పవన్ కుడికాలిని హిట్లర్ నాకుతాడని.. ఎడమ కాలిని స్వామి వివేకానంద నాకుతాడని అలాంటి పవర్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లో రామారావు గారు “చైతన్య రథం” మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్ కింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్గా కుదరకపోతే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్ గారూ, ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం అంటూ వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్స్ ఫై యావత్ అభిమానులు , జనసేన కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.