కొవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికా నిరాకరణ

మరింత డేటా కావాలని స్పష్టీకరణ

న్యూఢిల్లీ : కొవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ) అనుమ‌తి నిరాక‌రించింది. టీకా క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా చెబుతూ అనుమతులను నిరాకరించింది. కొవాగ్జిన్ తయారీకి అమెరికా భాగస్వామి అయిన ఆక్యుజెన్ ఫార్మా.. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసింది. అయితే, ఇప్పుడు ఎఫ్ డీఏ అనుమతులను తిరిస్కరించడంతో ఇక దానికి దరఖాస్తు చేయబోమని, అన్నీ పూర్తయ్యాక బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ ను పెట్టుకుంటామని ప్రకటించింది.

ఎఫ్ డీఏ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని చెప్పింది. కొవాగ్జిన్ ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసేందుకు మరింత సమాచారం కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో కొవాగ్జిన్ అమెరికాలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ఆక్యుజెన్ సీఈవో డాక్టర్ శంకర్ ముసునూరి చెప్పారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/