లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం

రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్పవాలు జరుపుతాం

gandham chandrudu
gandham chandrudu

విజయవాడ: రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా లేపాక్షి సంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పర్యాటక శాఖ ఏండీ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… మార్చి 7, 8న ఏపీ పర్యాటక శాక అధ్వర్యంలో అనంతపురంలో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి లేపాక్షి ఉత్సావాలను వైభవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాది సంస్కృతిని థీమ్‌గా తీసుకున్నామన్నారు. కాగా ఈ ఉత్సవం నిర్వహణకు 15 కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బాహ్య ప్రపంచానికి తెలియజేప్పెలా ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుందని, 2018లో లక్షకు పైగా ప్రజలు వచ్చారన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ పర్యటకలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన అంచన వేస్తున్నామన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/