కరోనా పై పోరుకు కోచ్‌ గోపిచంద్‌ విరాళం

రూ. 26 లక్షలు విరాళంగా ప్రకటన

pullela gopichand
pullela gopichand

హైదరాబాద్‌: కరోనా పై పోరుకు భారత బ్యాడ్‌మింటన్‌ ప్రధాన కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ తన వంతుగా విరాళాన్ని ప్రకటించాడు. కరోనాపై చేస్తున్న పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తనవంతుగా రూ.26 లక్షలను విరాళంగా ప్రకటించాడు. ఇందులో రూ.11లక్షలు పిఎం-కేర్స్‌కు కేటాయించగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహయ నిధికి రూ.10 లక్షలు, ఏపి రాష్ట్ర సహయనిధికి రూ.5లక్షలు కేటాయించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిం: https://www.vaartha.com/news/business/