జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ భూముల కబ్జాపై సీఎం రేవంత్ హామీ

‘జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ’కి కేటాయించిన భూములలో కబ్జా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కబ్జా ఫై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తానని హామీ ఇచ్చారు. జేఎన్‌జే సొసైటీ (JNJ Society) కి భూమి అప్పగింతపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో రిపోర్టు తెప్పించుకుంటానని పేర్కొన్నారు.

ఈ మేరకు హైదరాబాదులోని పెట్ బషీరాబాద్ లో జర్నలిస్టుల స్థలాలపై పెట్టిన సైన్ బోర్డులను కొందరు భూకబ్జాదారులు అక్రమంగా తీసేసారని విలేకరులు అడిగారు. దీంతో దీనిపైన పరిశీలన చేస్తానని, రిపోర్ట్ కూడా తెప్పించుకొని తగు చర్యలు చేపడతామని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటామని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చిన హామీ ప్రకారంగా స్థలాలను ఇవ్వాలని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సానుకూలంగా స్పందించారు.