‘నీరా కేఫ్’ పనులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గురువారం నెక్లెస్‌ రోడ్డులో నీరా కేఫ్‌ నిర్మాణ పనులను రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, అబ్కారీ, పర్యాటకశాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గీత వృత్తికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకే నీరా కేఫ్‌ అందుబాటులోకి తీసుకుస్తున్నట్లు అన్నారు. ప్ర‌మాద‌వ‌శాత్తు గీత కార్మికులు మ‌ర‌ణిస్తే ప్ర‌భుత్వం అందించే ఎక్స్ గ్రేషియాను రైతు భీమా తరహాలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కీలక ప్రకటన చేశారు.

ప్రజలకు ఆరోగ్యాన్ని , 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధ గుణాలు కలిగిన నీరా, కల్లును హైదరాబాద్ నగరంలో నిషేధం విధించి అవమానించారన్నారు. గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కొంతమంది అహంకార పూరిత రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కుల సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/