నా వెంట్రుక కూడా పీక లేరు అంటూ నంద్యాల సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి సడెన్ గా బోయపాటి అయ్యారు. బోయపాటి శ్రీను మూవీ లో ఎలాగైతే ఊర మాస్ డైలాగ్స్ ఉంటాయో..తాజాగా ఈరోజు నంద్యాల లో జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో జగన్ ఊర మాస్ డైలాగ్స్ తో ప్రతిపక్ష పార్టీలకు వణుకుపుట్టించారు. దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య ఎల్లోమీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం రాష్ట్రం చేసుకున్న కర్మ అని సీఎం జగన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వీరంతా కలిసి రాష్ట్ర పరువును తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. ఇవేవీ నన్ను కదిలించలేవు, బెదిరించ లేవని… దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల ఈ స్థాయికి వచ్చానని జగన్ అన్నారు. వాళ్ల నా వెంట్రుక కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు. ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ జాలిపడ్డారు.

గత ప్రభుత్వం హయాలంలో తక్కువగా ఉన్నజీఈఆర్‌ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను.. పెంచిన ఘనతను తమ ప్రభుత్వానిదేనని, ఇది గమనించమని ప్రజలను కోరారు సీఎం జగన్‌. నాడు-నేడుతో బడుల రూపురేఖలను మారుస్తూ.. సర్కారీ బడులకు మంచి రోజులు తీసుకొచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, యెల్లో మీడియాకు పట్టట్లేదని, పార్లమెంట్‌ వేదికగా చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వాళ్లదన్నారు.