కాంట్రాక్టర్లకు సీఎం రేవంత్ షాక్..

CM Revanth Reddy

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక పనుల్లో అవకతవకలు జరిగాయని ..అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు వాటిని బయటపెట్టే పనిలో పడింది. ఇప్పటికే గత ప్రభుత్వంలో పలు శాఖల్లో పనిచేసిన అధికారులను మార్చడం జరిగింది. తాజాగా కాంట్రాక్టర్లకు సైతం సీఎం రేవంత్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టు పనులను రివ్యూ చేసిన తరవాతే బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

అప్పటివరకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కాంట్రాక్టు సంస్థలకు బిల్లులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అంచనాలు పెంచి, కాంట్రాక్టు పనులు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరవాత వాటిపై రివ్యూ చేసి, చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించింది. అందులో భాగంగా కాంట్రాక్టు పనులను రివ్యూ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తున్నది.