నమస్తే ట్రంప్ ‘అద్భుతమైనది’: ఇవాంకా

నమస్తే ట్రంప్ కార్యక్రమం చూసి సంతోషంతో పొంగిపోయిన ఇవాంకా

ivanka-trump
ivanka trump

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు భారత్‌ పర్యటనకు ట్రంప్‌ దంపతులతో పాటు కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ కూడా వీక్షించారు. తన తండ్రి మాట్లాడుతుండగా ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు ఆమె స్పందన కోరారు. దాంతో ఇవాంకా “స్పెక్టాక్యులర్”  అంటూ ఒకే ఒక్క పదంతో తన అనుభూతిని వ్యక్తం చేశారు. ‘కళ్లు చెదిరిపోయాయి’ అనే అర్థం వచ్చేలా ఆమె చెప్పిన జవాబు ట్రంప్ కు భారత గడ్డపై లభిస్తున్న ఆదరణను చాటుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/