బిఆర్ఎస్​, బిజెపిది ఫెవికాల్ సంబంధంః సిఎం రేవంత్‌రెడ్డి

cm-revanth-reddy-speech-in-ts-assembly

హైదరాబాద్‌ః తెలంగాణ శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. శాసనమండలి సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని… వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సభ మర్యాదలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి సభ్యుల గురించి అగౌరవంగా మాట్లాడటం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో సభను శాసనమండలి చైర్మన్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపామని మండలి ఛైర్మన్ తెలిపారు. మరోవైపు, శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై మండలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు.

కాగా, బీఆర్ఎస్​ పదేళ్లుగా కేంద్రానికి అండగా నిలిచిందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్​ మద్దతు పలికిందని తెలిపారు. బిఆర్ఎస్​,బిజెపి నేతలు కలిసి పలుసార్లు చర్చించుకున్నారని పేర్కొన్నారు. సీఎంను మార్చుకునే విషయం కూడా మోడీ ఇక్కడే చెప్పారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కెసిఆర్‌ తమకు కొన్ని చెబుతారు. కొన్ని దాస్తారని అన్నారు. బిఆర్ఎస్​, బిజెపిది ఫెవికాల్ సంబంధమన్నారు.